క్రెడిట్ కార్డుపై భారీ ఆఫర్.. రూ.26వేల డిస్కౌంట్
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే తీపికబురు. ఎందుకంటే భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఇలా ఈఎంఐలో (EMI) ఏం కొన్నా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం ఏ ఏ ఆఫర్లు (Offers) లభిస్తున్నాయో తెలుసుకుందాం.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ఉంటే భారీగా రాయితీ వస్తోంది. రూ. 26 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎల్‌జీ కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులపై 26 శాతం తగ్గింపు ఉంది. రిటైల్ స్టోర్స్ లో రూ.14 వేలకు పైగా ఆఫర్ పొందొచ్చు. గరిష్టంగా రూ. 26 వేల వరకు ఉంది. జూన్ 30 వరకే ఈ ఆఫర్ ఉంటుంది. శాంసంగ్ ఉత్పత్తులపై కూడా తగ్గింపు ఉంది. వీటిపై 27.5 శాతం తగ్గిస్తున్నారు. రిటైల్ స్టోర్స్‌లో రూ.30వేల వరకు రాయితీ పొందొచ్చు. గరిష్టంగా రూ. 25 వేల వరకు తగ్గింపు ఉంటుంది.. అది కూడా ఈ నెలాఖరు వరకే.

సోనీ ఉత్పత్తులపై 12.5 శాతం రాయితీ ఉంది. రిటైల్ స్టోర్స్‌లో రూ.10వేలకు పైగా డీల్ పొందొచ్చు. గరిష్టంగా రూ. 22,500 వరకు ఇస్తారు. తగ్గింపు వస్తుంది. జులై 2వ తేదీవరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఖరీదెక్కువగా ఉన్న ఉత్పత్తులపై రూ.12,500 రాయితీ ఇస్తారు. జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కేనన్ కంపెనీ ఉత్పత్తులపై రూ.10 వేల నగదును సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా ఈ నెలాఖరు వరకే. లెనోవాపై జూన్ 30 వరకు ఆఫర్ ఉంది. దీనికి కూడా రూ.10వేల క్యాష్ బ్యాక్ ఇస్తారు. వోల్టాస్ పై రూ.9500 వరకు తగ్గింపు ఉంది. బాష్ కంపెనీ ఉత్పత్తులపై రూ.8వేల తగ్గింపు ఉంది. ఈ రెండు కంపెనీల ఆఫర్లు ఈ నెలాఖరు వరకే ఉంటాయి. ఈఎంఐ ద్వారా చెల్లింపులు చేసేవారికే ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి.












Click it and Unblock the Notifications