ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, తగ్గిన మరణాలు: జిల్లాలవారీగా కొత్త కేసులు, పెరిగిన రికవరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 3వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,00,103 నమూనాలను పరీక్షించగా.. 3040 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 3040 కరోనా కేసులు, 14 మంది మృతి
తాజాగా నమోదైన 3040 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,17,253కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 14 మంది మృతి చెందారు.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,960 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 30వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 4,576 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,73,993కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 30,300 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,27,99,245 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 659 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 45 మంది కరోనా బారినపడ్డారు.
Recommended Video

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 85, చిత్తూరులో 441, తూర్పుగోదావరిలో 659, గుంటూరులో 211, కడపలో 158, కృష్ణాలో 242, కర్నూలులో 77, నెల్లూరులో 273, ప్రకాశంలో 316, శ్రీకాకుళంలో 106, విశాఖపట్నంలో 130, విజయనగరంలో 45, పశ్చిమగోదావరిలో 297 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,68,837, చిత్తూరులో 2,23,818 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(80,753) కరోనా కేసులున్నాయి.












Click it and Unblock the Notifications