ఏపీలో కరోనా కల్లోలం: 3వేలకుపైగా కొత్త కేసులు, చిత్తూరులో విజృంభణ, 20వేలకుపైగా యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,719 నమూనాలను పరీక్షించగా.. 3495 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 3వేలకుపైగా కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 3వేలకుపైగా కరోనా కేసులు


తాజాగా నమోదైన 3495 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,25,401కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,300కి చేరింది.

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1198 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,97,147కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులున్నాయి.

చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం

చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,54,29,391 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719, గుంటూరు జిల్లాలో 501 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మినహా 11 జిల్లాల్లో 100కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురంలో 209, చిత్తూరులో 719, తూర్పుగోదావరిలో 41, గుంటూరులో 501, కడపలో 192, కృష్ణాలో 306, కర్నూలులో 191, నెల్లూరులో 190, ప్రకాశంలో 215, శ్రీకాకుళంలో 293, విశాఖపట్నంలో 405, విజయనగరంలో 193, పశ్చిమగోదావరిలో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+