రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మృత్యుశకటంగా లారీ, ఔటర్ జంక్షన్ రక్తసిక్తం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడుకు చెందిన లారీ ఆదివారం రాత్రి మృత్యుశకటంగా మారింది. శంషాబాద్ ఔటర్ జంక్షన్ వద్ద జరిగిన ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండిపల్లి గ్రామంలోని హైదరాబాద్, బెంగళూరు జాతీయరహదారిపై ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు శంషాబాద్‌లోని హైమద్‌నగర్‌కు చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్టు సమాచారం.

ఓ బైక్‌పై వెళుతున్న వ్యక్తి హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన వాడిగా భావిస్తున్నారు. గాయపడ్డ వారిని అంబులెన్సులో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారంతా నగరంలోని వివిధ బస్తీలకు చెందిన వారని తెలిసింది. ప్రమాదం కారణంగా ఈ దారిలో దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ తొండిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు. ఆదివారం కావడంతో నగరానికి చెందిన అనేకమంది మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని పవిత్ర పుణ్యస్థలం జహంగీర్ పీర్ దర్గాకు వెళ్లి వస్తున్నారు.

రోడ్డు రక్తసిక్తం

రోడ్డు రక్తసిక్తం

తమిళనాడుకు చెందిందిగా భావిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మృత్యుశకటం

మృత్యుశకటం

ఎదురుగా వస్తున్న మూడు కార్లు, ఓ ఆటో, రెండు బైకులను లారీ ఢీకొని రోడ్డుపక్కనున్న గోతిలో పడిపోయింది.

వాహనాలు నుజ్జునుజ్జు

వాహనాలు నుజ్జునుజ్జు

ఎదురు వస్తున్న లారీ ఢీకొట్టడంతో మూడు కార్లు, ఆటో, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ముగ్గురు మరణించారు.

ముగ్గురు దుర్మరణం

ముగ్గురు దుర్మరణం

ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మొత్తం ఇరవై మంది గాయపడ్డారు.

తీవ్ర ఆందోళన

తీవ్ర ఆందోళన

ఘోర రోడ్డు ప్రమాదంతో వాహనాలు నుజ్జునుజ్జు కావడమే కాకుండా రోడ్డు రక్తసిక్తమైంది. తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది.

English summary
Three persons were killed and eight others suffered injuries when a truck reportedly went amok and crashed into five vehicles coming in the opposite direction at Tondupally in Shamshabad on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X