అత్తను వేధించాడని చంపేశాడు! కొడుక్కి ఉరేసిన తల్లి

 30 year man murdered by his relative
హైదరాబాద్: సైకోగా ప్రవర్తించే ఓ యువకుడు మేనమామపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేసిన సంఘటన హైదరాబాదులోని కార్వాన్‌లోని ఇందిరానగర్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇందిరానగర్‌కు చెందిన అనురాధ అనే 28 ఏళ్ల యువతికి బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీకి చెందిన హనుమంతు(30)తో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది.

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. హనుమంతు కూలీగా పని చేసేవాడు. కామెర్ల వ్యాధితో చిన్న కొడుకు ఇటీవలె మృతి చెందాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిస అయిన హనుమంతు తరుచూ భార్యతో గొడవపడుతుండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక అనురాధ తరుచూ పుట్టింటికి వచ్చేది.

పెద్దలు సర్ది చెప్పడం, తిరిగి ఆమెను హనుమంతు తీసుకు వెళ్లడం జరుగుతుండేది. దీనిని అనురాధ సోదరుడి కొడుకు నర్సింహ గమనించాడు. ఓ సందర్భంగా అతను తాగిన మైకంలో ఒళ్లంతా బ్లేడుతో కోసుకొని సైకోగా వ్యవహరించే వాడు.

రెండు నెలల క్రితం హనుమంతును హెచ్చరించారు. తన మేనత్తను కొట్టినా, వేధించినా అంతు చూస్తానని హెచ్చరించాడు. హనుమంతులో మార్పు రాలేదు. రెండు రోజుల క్రితం హనుమంతు భార్యను తీసుకు వెళ్లేందుకు వచ్చాడు.

ఈ క్రమంగా హనుమంతు, నర్సింహలు మద్యం తాగారు. హనుమంతు గొడవ విషయమై భార్యను తప్పు పడుతూ తిడుతుండటంతో కోపం పట్టలేని నర్సింహ కర్రతో హనుంతుపై దాడి చేశాడు. కుప్పకూలిన అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో మృతి చెందాడు. నర్సింహ పరారీలో ఉన్నాడు.

మరో ఘటనలో...

తల్లిదండ్రుల మధ్య తలెత్తిన మనస్పర్థలకు చిన్నారి బలయ్యాడు. అదీ చిన్నారి పుట్టిన రోజు నాడే చోటు చేసుకుంది. పార్శిగుట్టకు చెందిన నర్సింగ రావు, మీనా కుమారిలకు ఓ కొడుకు ఉన్నాడు. కుటుంబ గొడవల నేపథ్యంలో మీనా తన కొడుకుతో పాటు తన పుట్టింటికు కొద్దిరోజుల నిమిత్తం వెళ్లింది. బుధవారం కొడుకు పుట్టిన రోజు కావడంతో నర్సింహ రావు తన ఇంటి వద్ద పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని భార్య, కుమారుడిని మంగళవారం తీసుకు వచ్చాడు.

మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో మీనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ముందుగా కుమారుడికి ఉరి వేసింది. ఆ తర్వాత తను ఫ్యానుకు ఉరేసుకుంది. పక్కింటి వారు తలుపులు బద్దలు కొడ్డి తల్లీకుమారులను ఆసుపత్రిలో చేర్పించారు. కుమారుడు మృతి చెందాడు. తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది. చికిత్స పొందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+