ఏపీలో తగ్గిన కొత్త కరోనా కేసులు, మరణాలు: జిల్లా వారీగా, తగ్గిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత వారం రోజుల్లో ఒక రోజు స్వల్పంగా తగ్గుతూ.. మరో రోజు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. అయితే, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.

ఏపీలో కొత్తగా 3986 కేసులు, 23 మరణాలు

ఏపీలో కొత్తగా 3986 కేసులు, 23 మరణాలు


ఏపీలో గత 24 గంటల్లో 74,945 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,132కు చేరింది.

జిల్లాల వారీగా కరోనా మరణాలు

జిల్లాల వారీగా కరోనా మరణాలు

గత 24 గంటల్లో మరణించినవారి సంఖ్య జిల్లాల వారీగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 6429కి చేరింది.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు

జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 201, చిత్తూరులో 458, తూర్పుగోదావరిలో 481, గుంటూరులో 496, కడపలో 266, కృష్ణాలో 503, కర్నూలులో 55, నెల్లూరులో 196, ప్రకాశంలో 334, శ్రీకాకుళంలో 168, విశాఖపట్నంలో 218, విజయనగరంలో 82, పశ్చిమగోదావరిలో 528 కేసులు నమోదయ్యాయి.

36వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

36వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు


గడిచిన 24 గంటల్లో 4591 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,40,229కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,474 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70,66,203 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

దేశ వ్యాప్తంగానూ తగ్గుతున్న యాక్టివ్ కేసులు

దేశ వ్యాప్తంగానూ తగ్గుతున్న యాక్టివ్ కేసులు


ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఇప్పటి వరకు 75 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 66 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,83,100 యాక్టివ్ కేసులున్నాయి. లక్ష మందికిపైగా కరోనా మరణాలు సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+