నలుగురు వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలదే గెలుపు

 4 YSR Congress netas got re-elected
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన సిట్టింగ్ శాసనసభ్యుల్లో నలుగురు మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతావారంతా ఓటమి పాలయ్యారు. ఆ నలుగురిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన శోభా నాగిరెడ్డితో పాటు మరో ముగ్గురు ఉన్నారు. రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోడూరు నుంచి కోరుముట్ల శ్రీనివాసులు, మాచర్ల నుంచి పి. రామకృష్ణా రెడ్డి ఉన్నారు.

గత శాసనసభలో వైయస్ జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 18 మంది ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే వారందరికీ మంత్రి పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతారు. అయితే, పార్టీ ఓటమి పాలు కావడంతో పాటు వారిలో నలుగురు మాత్రమే విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లకు తమ పార్టీకి వచ్చిన ఓట్లకు మధ్య తేడా చాలా స్వల్పంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుకుంటున్నారు టిడిపిపై కేవలం 1.96 శాతం ఓట్ల తేడాతోనే తాము ఓడిపోయామని అంటున్నారు. అంటే 5.6 లక్షల ఓట్లు

తెలుగుదేశం పార్టీకి 1.34 కోట్ల ఓట్లు రాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 1.29 కోట్ల ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 46.86 శాతం కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడిన ఓట్ల శాతం 44.9. స్వల్ప తేడాతోనే వైయస్సార్ కాంగ్రెసుపై తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+