ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: అంతకుమించే కోలుకున్నారు, తగ్గిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా స్వల్పంగా పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో 73,767 నమూనాలను పరీక్షించగా 4038 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,71,503కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 38 మంది మృతి చెందారు.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు

ఏపీలో కొత్తగా నమోదైన కేసులు జిల్లాల వారీగా.. అనంతపురంలో 130, చిత్తూరులో 264, తూర్పుగోదావరిలో 345, గుంటూరులో 285, కడపలో 148, కృష్ణాలో 325, కర్నూలులో 68, నెల్లూరులో 133, ప్రకాశంలో 192, శ్రీకాకుళంలో 76, విశాఖపట్నంలో 74, విజయనగరంలో 52, పశ్చిమగోదావరిలో 159 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

జిల్లాల వారీగా మరణాలు

జిల్లాల వారీగా కరోనా మరణాలు పరిశీలించినట్లయితే.. చిత్తూరులో 9 మంది, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6357కు చేరింది.

ఎక్కువే కోలుకున్నారు..

ఎక్కువే కోలుకున్నారు..

ఒక్కరోజులో 5622 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,22,204కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,047 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 68,46,040 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలోనూ తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలోనూ తగ్గుతున్న కరోనా కేసులు

ఇక దేశంలోనూ కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అలాగే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 73,37,358 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 8,09,981 యాక్టివ్ కేసులున్నాయి. 64,14,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,11,623 మంది కరోనా బారినపడి మరణించారు. గురువారం రాత్రి 8గంటల వరకు దేశంలో కొత్తగా 32,268 కరోనా కేసులు నమోదు కాగా, 34,366 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+