ఐదుగురు దొంగల అరెస్ట్: రూ. 4లక్షలు సీజ్(పిక్చర్స్)

విశాఖపట్నం: విలాసాలకు, చెడు వ్యసనాలకు బానిసలై షట్టర్ దొంగతనాలకు పాల్పడ్డుతున్న ముగ్గురు యువకులను కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను క్రైం డిసిపి జె మురళీధర్ మీడియాకు తెలిపారు. రెడ్డి కంచరపాలెనికి చెందిన కొయ్యా మనో‌జ్‌కుమార్, గిరిజాల సతీష్ కుమార్ అలియాస్ పండు, కిలాడి సింహాద్రిలు జులై 24న రాత్రి గవర కంచరపాలెంలోని రత్న కిరాణా జనరల్ స్టోర్స్ షట్టర్ వంచి చోరీకి పాల్పడ్డారు.

దుకాణం నుంచి రూ.1.80 లక్షల నగదు, 2 తులాల బంగారు గాజులు అపహరించారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. చోరీ సొత్తును జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వద్ద దాచి పెట్టినట్లు నిందితులు వెల్లడించారు. చోరీ చేసిన సొమ్ములో రూ. 20వేలు ఖర్చు చేశామని అంగీకరించారు. మిగిలిన సొమ్ముతో గోవా వెళ్లి ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకున్టన్లు నిందితులు తెలిపారు.

రెండు తులాల బంగారు గాజులను నిందితుడు మనోజ్ కుమార్ తన తల్లి జయలక్ష్మి వద్ద దాచిపెట్టడంతో పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద గాజులు, నిందితుల నుంచి 1.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో క్రైం ఏడిసిపి మహ్మాద్ ఖాన్, క్రైం ఏడిసిపి వరదరాజు, కంచరపాలెం సిఐ మోహనరావు పాల్గొన్నారు.

మరో ఘటనలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేసినట్లు డిసిపి మురళీధర్ తెలిపారు. ప్రధాన నిందితుడు గొర్లె పైడిరాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితుల నుంచి రూ. 1.45 లక్షలు, 25 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులు బేత ప్రసాద్, సుధాకర్ రావు పార్వతీపురం వారని పోలీసులు చెప్పారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

విలాసాలకు, చెడు వ్యసనాలకు బానిసలై షట్టర్ దొంగతనాలకు పాల్పడ్డుతున్న ముగ్గురు యువకులను కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను క్రైం డిసిపి జె మురళీధర్ మీడియాకు తెలిపారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

రెడ్డి కంచరపాలెనికి చెందిన కొయ్యా మనో‌జ్‌కుమార్, గిరిజాల సతీష్ కుమార్ అలియాస్ పండు, కిలాడి సింహాద్రిలు జులై 24న రాత్రి గవర కంచరపాలెంలోని రత్న కిరాణా జనరల్ స్టోర్స్ షట్టర్ వంచి చోరీకి పాల్పడ్డారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. నిందితుల నుంచి 1.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేసినట్లు డిసిపి మురళీధర్ తెలిపారు. అరెస్టయిన నిందితుల నుంచి రూ. 1.45 లక్షలు, 25 గ్రాముల బంగారం స్వాధీనంచేసుకున్నట్లు ఆయన తెలిపారు,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+