ఏపీలో కొత్తగా 58 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్నంటే..? పెరిగిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 20,269 నమూనాలను పరీక్షించగా.. 58 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,89,974కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

గత 24 గంటల్లో కరోనాతో ఎవరూ కూడా మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7169 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 51 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,82,080కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,39 కోట్ల కరోనా నమూనాలను పరీక్షించారు.

 58 new corona cases reported in andhra pradesh: no deaths in last 24 hours

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 7, కడపలో 10, కృష్ణాలో 1, కర్నూలులో 6, నెల్లూరులో 4, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 1, పశ్చిమగోదావరి 2 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశంలోనూ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఒక్కరోజే 15,510 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 87.25 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో 8293, కేరళలో 3254, పంజాబ్ లో 579, కర్ణాటకలో 521, తమిళనాడులో 479, గుజరాత్‌లో 407 కొత్త కరోనా కేసులు పెరగాయి. గత 24 గంటల్లో 106 మరణాలు నమోదైనప్పటికీ వాటిలో 87 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కొత్త మరణాల్లో మహారాష్ట్రలో 62, కేరళలో 15, పంజాబ్ 7, కర్ణాటక 5, తమిళనాడు 3 చొప్పున నమోదయ్యాయి.

దేశంలో ప్రస్తుతం 1,68,627(1.52శాతం) యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లోనే 84 శాతం యాక్టివ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 46.39శాతం, కేరళలో 29.49 శాతం, కర్ణాటకలో 3.45 శాతం, పంజాబ్‌లో 2.75శాతం, తమిళనాడులో 2.39శాతం చొప్పున ఉంది. కాగా, అత్యధికంగా కేరళ, మహారాష్ట్రలో 10వేలకుపైగా యాక్టివ్ కేసులుండగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. మార్చి 1 నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+