వేసవికి 64 ప్రత్యేక రైళ్లు
వేసవికాలంలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 64 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా రిజర్వేషన్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19 నుంచి జూలై 2 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
నెంబర్ 03226 సికింద్రాబాద్-దానాపూర్ రూట్‌లో మే 7 నుంచి జూలై 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు సాయంత్రం 7.00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. మొత్తం 9 సర్వీసులు నడుస్తాయి.

నెంబర్ 03225 దానాపూర్-సికింద్రాబాద్ మార్గంలో మే 4 నుంచి జూన్ 29 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 8.50 గంటలకు దానాపూర్‌లో బయల్దేరి, శనివారం తెల్లవారుజామున 4.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం 9 సర్వీసులు నడుస్తాయి. కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్‌షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కత్నీ, సాట్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతాయి.
-----
నెంబర్ 07189 నాందేడ్-ఈరోడ్ మార్గంలో ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు ఈరోడ్ చేరుకుంటుంది. మొత్తం 11 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
నెంబర్ 07190 ఈరోడ్-నాందేడ్ మార్గంలో ఏప్రిల్ 23 నుంచి జులై 2వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం తెల్లవారుజామున 5.15 గంటలకు ఈరోడ్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 7.30 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. మొత్తం 11 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ఈ రైళ్లు ముధ్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూగ్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
----

నెంబర్ 08312 కొయంబత్తూర్-సంబాల్‌పూర్ మార్గంలో ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 వరకు 11 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు కొయంబత్తూర్‌లో బయల్దేరి తర్వాత రోజు రాత్రి 9.15 గంటలకు సంబాల్‌పూర్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు బార్‌గఢ్ రోడ్, బలంగీర్, తిత్లాగఢ్, కేసింగ్, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం జంక్షన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ స్టేషన్లలో ఆగుతాయి












Click it and Unblock the Notifications