ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు... కొత్తగా 6751 పాజిటివ్ కేసులు...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 7లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 6751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 41 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5869కి చేరింది. ప్రస్తుతం 57,858 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం(అక్టోబర్ 1) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 7297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,36,508కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 71,577 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 58,78, 135కు చేరింది.

 6751 new coronavirus cases total number reached to 7 lakh in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 888 కేసులతో చిత్తూరు,783 కేసులతో ప్రకాశం ఉన్నాయి. ఇప్పటివరకూ అత్యధికంగా తూర్పు గోదావరిలో 98160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక తాజాగా నమోదైన మరణాల్లో... చిత్తూరులో 7 మంది, కృష్ణా జిల్లాలో ఆరుగురు,ప్రకాశంలో ఐదుగురు,విశాఖపట్నంలో ఐదుగురు,అనంతపుంలో నలుగురు,తూర్పుగోదావరిలో నలుగురు,గుంటూరులో ముగ్గురు,కడపలో ముగ్గురు,పశ్చిమ గోదావరిలో ఇద్దరు,నెల్లూరులో ఒక్కరు,శ్రీకాకుళంలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు.

Recommended Video

    Sonu Sood Conferred With UNDP Award | Joins Priyanka Chopra, Angelina Jolie, Leonardo DiCaprio

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+