దోపిడీ దొంగల ముఠా అరెస్ట్: బంగారం సీజ్(పిక్చర్స్)

విశాఖపట్నం: దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న ఎనిమింది ముఠా సభ్యులను విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు అపహరించిన 165 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను నగర పోలీస్ కమిషనర్ బి. శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ముఠా సభ్యులలో ప్రధాన నిందితుడు పోలిపల్లి కాళిదాసు గతంలో బోయపాలెంలో సుధారాణి అనే ఆమె ఇంట్లో బజాజ్ షోరూం నిర్వహించేవాడు.

నష్టం వాటిల్లడంతో వ్యాపారం మూసివేసి, ఆనందపురం, వేములవలసలో స్ర్కాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారంలో అతనికి బొబ్బిలి వేణు, సరిపల్లి రామకృష్ణ, సరిపల్లి శ్రీనివాసరావు, బోర్లి పైడిరాజు, కోన కృష్ణతో పరిచయం ఏర్పడింది. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి దోపిడీలు, దొంగతనాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఏప్రిల్ 20న గతంలో తాను బజాజ్ షోరూం నిర్వహించిన సుధారాణి ఇంట్లోనే దొంగతనం చేసేందుకు నిర్ణయించారు.

అదే రోజు రాత్రి కాళిదాసుతోపాటు మరో ఏడుగురు నిందితులు సుధారాణి ఇంటికి వెళ్లి ఆమె తలపై రాడ్, కత్తితో దాడికి దిగారు. ఈ హఠాత్పరిమాణంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఇతర కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు ఆమె ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది దోపిడీదారులు మేడపై నుంచి దూకేశారు. అయితే నిందితుల్లో ఒకడైన సాధిరెడ్డి వినయ్ కుమార్ కాలు విరగడంతో అతడు స్థానికులకు పట్టుపడిపోయాడు. వారు వినయ్ కుమార్‌ను పోలీసులకు అప్పగించడంతో.. ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం పోలీసులు, విచారణ జరిపారు.

విచారణలో మిగిలిన నిందితుల పేర్లను వెల్లడించాడు వినయ్ కుమార్. దర్యాప్తు జరిపిన పోలీసులు, ఆదివారం గంభీరం రిజర్వాయర్ వద్ద మిగితా నిందితులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద బంగారం కొనుగోలు చేసిన ధర్మరాజు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో ఇద్దరు నిందితులు కొమ్మోజు శ్రీనివాసరావు, బొబ్బిలి వేణు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆనందపురానికి చెందిన కుప్పతౌడమ్మ అనే వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన కేసులో కాళిదాసు, త్రినాథ్‌లు నిందితులుగా ఉన్నారని పోలీసులు చెప్పారు.

స్వాధీనం చేసుకున్న బంగారం

స్వాధీనం చేసుకున్న బంగారం

దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న ఎనిమింది ముఠా సభ్యులను విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు అపహరించిన 165 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తూ..

వివరాలు వెల్లడిస్తూ..

దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న ఎనిమింది ముఠా సభ్యులను విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ మేరకు వివరాలను నగర పోలీస్ కమిషనర్ బి. శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తూ..

వివరాలు వెల్లడిస్తూ..

ముఠా సభ్యులలో ప్రధాన నిందితుడు పోలిపల్లి కాళిదాసు గతంలో బోయపాలెంలో సుధారాణి అనే ఆమె ఇంట్లో బజాజ్ షోరూం నిర్వహించేవాడు.

మీడియా ముందుకు నిందితులు

మీడియా ముందుకు నిందితులు

నష్టం వాటిల్లడంతో వ్యాపారం మూసివేసి, ఆనందపురం, వేములవలసలో స్ర్కాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారంలో అతనికి బొబ్బిలి వేణు, సరిపల్లి రామకృష్ణ, సరిపల్లి శ్రీనివాసరావు, బోర్లి పైడిరాజు, కోన కృష్ణతో పరిచయం ఏర్పడింది.

మీడియా ముందుకు నిందితులు

మీడియా ముందుకు నిందితులు

నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడి దోపిడీలు, దొంగతనాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఏప్రిల్ 20న గతంలో తాను బజాజ్ షోరూం నిర్వహించిన సుధారాణి ఇంట్లోనే దొంగతనం చేసేందుకు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+