తిరుమలలో కొండచిలువ కలకలం
తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ హల్ చల్ చేసింది. సుమారు 8 అడుగుల కొండచిలువ కనిపించడంతో భక్తులు హడలిపోయారు. స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద స్థానికులు కొండచిలువను గమనించారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై పాములను పట్టేవ్యక్తికి సమాచారం అందించారు. అతను చాకచక్యంగా కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications