చెల్లెలుకు వరుసైన బాలికను రేప్ చేసి, గర్భవతిని చేశాడు

చిత్తూరు/ విజయవాడ: ఓ కామాంధుడు చెల్లెలు వరుసైన బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం గుర్విందగుంటలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అన్న కుమారుడు (35) గత నెల 25న తన బాబాయి కుమార్తె(14)ను తాటికాయ ముంజలు కోసి ఇస్తానని మభ్యపెట్టి శివారులోని పొలాల వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను భయపెట్టి పలుమార్లు ఆత్యాచారం చేశాడు.

ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇలా పది రోజులు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక, అడ్డుకోలేక తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లోనే కాలం గడుపుతోంది. కూతురు ప్రవర్తనను, ఆరోగ్యం క్షీణించటాన్ని గుర్తించిన తల్లి నిలదీసింది. దాంతో ఒక్కసారిగా భోరుమన్న బాలిక ఆ కామాంధుడి అకృత్యాలను వివరించింది.

Rape

అది విన్న కుటుంబ సభ్యులు మానసికంగా కృంగిపోయారు. వెంటనే బాలికకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా ఆమె గర్భవతని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు తెలిపారు. అయితే పెద్దల పంచాయితీ బెడిసికొట్టడంతో నిందితుడు పరారయ్యాడు. బాలిక కుటుంబం పెదపారుపూడి పోలీసులను ఆశ్రయించగా శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా పాకాల మండలం దామలచెరువులో ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు కామాంధుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, అనంతపురం జిల్లా గుంతకల్లులో మూడు రోజుల క్రితం నాగప్ప కాలనీకి చెందిన 45 ఏళ్ల మహిళపై మస్తానయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంగళవారం తెల్లవారుజామున ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న బాధితురాలిని మస్తానయ్య తలుపుతట్టి నిద్ర లేపాడు. బలవంతంగా పక్కనే ఉన్న మున్సిపల్‌ పాఠశాల ఆవరణలోకి కొట్టుకుంటూ లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+