ఆ మూడు జిల్లాల్లో తిష్ట వేసిన కరోనా: కృష్ణాలో శాంతించినా.. అక్కడ మళ్లీ భారీగా: 258 మంది.. !

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. ఒక జిల్లాలో తగ్గాయని అనుకునే లోపే.. మరో జిల్లాలో దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 82 కేసులు నమోదు అయ్యాయి. 80, అంతకమించి పాజిటివ్ కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడోసారి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1259కి చేరుకున్నాయి.రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో మొత్తం 82 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

మొత్తం 5784 శాంపిళ్లను పరీక్షించామని తెలిపారు. ఇప్పటిదాకా 258 మంది ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జి అయ్యారని, 31 మంది మరణించినట్లు తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం 970 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పరీక్షల సంఖ్య 80,334కు చేరుకుందని అన్నారు. వాటిల్లో 24 గంటల్లో 5784 కేసుల ఫలితాలకు సంబంధించిన నివేదికలు అందాయని చెప్పారు. మరి కొన్ని శాంపిళ్లకు చెందిన నివేదికు ఇంకా అందాల్సి ఉందని అన్నారు.

82 new covid-19 positive cases reported in Andhra Pradesh. total cases reached 1259

కొత్తగా వెలుగు చూసిన 82 పాజిటివ్ కేసుల్లో అత్యధికం కర్నూలు జిల్లాలో నమోదైనవే. 24 గంటల వ్యవధిలో ఈ జిల్లాలో కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఈ జిల్లాలో ఇప్పటిదాకా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 332కు చేరుకుంది. గుంటూరులో 17, కృష్ణాలో 13, కడపలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో మూడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు కొత్తగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చాలాకాలం తరువాత కడపలో ఒకేసారి ఏడు కేసులు నమోదు అయ్యాయి.

82 new covid-19 positive cases reported in Andhra Pradesh. total cases reached 1259

జిల్లాలవారీగా అనంతపురం-54, చిత్తూరు-74, తూర్పు గోదావరి-39, గుంటూరు-254, కడప-65, కృష్ణా-223, కర్నూలు-332, నెల్లూరు-82, ప్రకాశం-56, శ్రీకాకుళం-4, విశాఖపట్నం-22, పశ్చిమ గోదావరి-54 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయనగరంలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూాడా నమోదు కాలేదు. కాగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43 మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ జిల్లాలోనే అత్యధిక మరణాలు కూడా నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా తొమ్మిది మంది కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల మరణించారు.

Recommended Video

    Lockdown In AP will Be Eased in Green Zones Across The State

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+