ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు... మరో 82 మంది మృతి....

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 82 మంది మృతి చెందారు. ఇందులో తూర్పుగోదావరిలో 10 మంది, గుంటూరులో 10, అనంతపురంలో 8 మంది, కడపలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 6, నెల్లూరులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 6, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 5, కృష్ణ జిల్లాలో ఒకరు కరోనాతో మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 2378కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 55,692 కరోనా టెస్టులు చేయగా... మొత్తం టెస్టుల సంఖ్య 27 ల‌క్ష‌లు దాటింది. ఈ నెల 13 నాటికి మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య‌ 27,05,459కు చేరుకుంది.తాజాగా 9,499 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా ఇప్పటివరకూ 1,70,924 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 963 కరోనా పాజిటివ్ కేసులు, విశాఖపట్నం జిల్లాలో 931, అనంతపురం 856, పశ్చిమ గోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకుళం 425, కృష్ణా జిల్లాలో 330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 9,996 new coronavirus cases reported in andhra pradesh on thursday

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ 82971 04104 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. కరోనా సోకితే కనిపించే లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పరీక్షల వివరాలను హెల్ప్ లైన్ ద్వారా వివరించనున్నారు. కరోనా సోకితే ఎవరిని సంప్రదించాలి... ఏం చేయాలన్న సందిగ్ధం ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

కాగా, ఇటీవలి కాలంలో ఏపీలో 10వేల కరోనా పాజిటివ్ కేసులు తరుచూగా నమోదవుతున్నాయి. అయితే టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+