అప్పల నాయుడు ఎఫెక్ట్: సస్పెన్షన్ ఎత్తివేయాలని టిడిపికి 9మంది రాజీనామా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం మాజీ సర్పంచి రెడ్డి అప్పలనాయుడిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం మాజీ సర్పంచి రెడ్డి అప్పలనాయుడిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ నేత హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

పార్టీ నుంచి సస్పెన్షన్
పశ్చిమ గోదావరి జిల్లా టిడిపి అద్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్‌తో పాటు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

అప్పలనాయుడుకు మద్దతుగా
రెడ్డి అప్పలనాయుడిపై కేసులను నిరసిస్తూ ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలో తొమ్మిది మంది వార్డు మెంబర్లు టిడిపికి రాజీనామా చేశారు. మాజీ సర్పంచ్ రెడ్డి అప్పల నాయుడుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ గోదావరిలో రాజీనామాల కలకలం
కాగా, ఇటీవల పశ్చిమమ గోదావరి జిల్లాలో రాజీనామా హెచ్చరికల పర్వం కొనసాగుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబుల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది.

17 మంది రాజీనామాలపై..
మాగంటి బాబు కోసం పలువురు నేతలు రాజీనామా చేశారు 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేసారు. దీనిపై పీతల సుజాత వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారివన్నీ ఉత్తుత్తి రాజీనామాలేనని పీతల సుజాత ఆరోపించారు.












Click it and Unblock the Notifications