సెక్స్ చేసి బాలుడి హత్య: మహిళ ఆత్మహత్యాయత్నం

A 8years child kidnapped and brutally murdered
హైదరాబాద్: నగరంలోని చందానగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు కృష్ణ హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 12న కృష్ణను రామన్ పటేల్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలుడిపై హోమో సెక్స్ చేసిన రామన్, ఆ తర్వాత బాలుడ్ని కిరాతకంగా హత్య చేశాడు.

న్యాయం చేయలేదని హెచ్ఆర్‌సి మహిళ ఆత్మహత్యాయత్నం

తనకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన ఓ మహిళ, తనకు న్యాయం జరగదని భావించి హైదరాబాద్ నగరంలోని మానవ హక్కుల సంఘం కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన బాధితురాలు మస్తానమ్మకు గత ఏడాది శివ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే తన భర్త పది రోజుల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె తెలిపింది. మానవ హక్కుల సంఘానికి వెళితే న్యాయం జరుగుందని చెప్పడంతో తాను ఇక్కడి వచ్చానని చెప్పింది. అయితే తన బాధను ఎవరూ వినిపించుకోకపోవడంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్: జిల్లాలోని సదాశివపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన యువకులు రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట మండలం మొరంపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+