పది రూపాయల కోసం గొడ్డలితో దాడిచేసిన గంజాయి బ్యాచ్..
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తులో కొన్ని జీవితాలు చిత్తయిపోతున్నాయి. తాజాగా గుంటూరులో గంజాయ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. గంజాయి మత్తులో పడి కొందరు అమాయకులపై దాడులు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పది రూపాయల కోసం గొడవ దిగారు గంజాయి బ్యాచ్.. చిన్న గొడవ కాస్త పెద్దదయ్యి గొడ్డలి దాడికి సిద్ధపడ్డారు. ఈ గొడవలో ఒకరు గొడ్డలి దాడికి గురయ్యారు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు కొందరు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
ముగ్గురోడ్డు ప్రాంతంలో గంజాయి విక్రయాలు : తాడేపల్లిలోని ముగ్గు రోడ్డు పరిసరాలను గంజాయి బ్యాచ్ అడ్డాగా మార్చకుందని, రాత్రయితే చాలు ఇక్కడ గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తుందని ఇక్కడి వారు వాపోతున్నారు. గంజాయి మత్తులో మారణాయుధాలు పట్టుకుని వచ్చి స్థానికులను భయపెడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. చీకటి పడితే చాలే గంజాయి బ్యాచ్ వస్తోందని, ఆ సమయంలో బయటకు రావాలంటే భయంగా ఉందని అక్కడివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురోడ్డు ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, ఈ దాడితో అయినా పోలీసులు స్పందించి ఆ ప్రాంతంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గంజాయి బ్యాచ్ ను అదుపుచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

స్పందించిన సీఐ : ఈ ఘటనపై తాడేపల్లి సీఐ మల్లికార్జునరావు స్పందిస్తూ... గంజాయి మత్తులో దారుణంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇకపై ముగ్గురోడ్డు ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందన్నారు. స్థానికుల కోరికమేరకు సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో ఇకపై ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని సీఐ తెలిపారు.












Click it and Unblock the Notifications