స్టీల్ సిటీలో మారుతున్న లెక్కలు - గెలుపు దక్కేదెవరికి..!!

ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ పోరులో కీలక నియోజకవర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కూటమి పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సింగిల్ గా పోటీ చేస్తున్న జగన్ అధికారం నిలబెట్టుకొని తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ సీట్ల గెలుపు పార్టీలకు కీలకంగా మారుతోంది. మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో విశాఖ ఎంపీ సీటులో పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

సాగర తీరాన హోరా హోరీ
విశాఖ ఎంపీ సీటులో గెలుపు పైన నగరంలో చర్చ మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్దులు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. విశాఖలో ప్రచారం సమయంలోనే ఈ సారి ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారనేది స్ఫష్టత వస్తోంది. నగరంలోని ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా వైసీపీ నుంచి మాజీ ఎంపీ బొత్సా ఝాన్సీని అభ్యర్దిగా బరిలోకి దించారు.

A big fight is on the cards between TDP and YSRCP in Visakha loksabha Details here

టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. విశాఖ స్థానం పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. చివరి వరకు ప్రయత్నించినా ఆ సీటు దక్కలేదు. ఇక్కడ ఉత్తరాది ఓటర్లు గణనీయంగా ఉండటంతో తమకు కలిసి వస్తుందని అంచనా వేసారు. కానీ, టీడీపీకి సీటు దక్కటంతో బీజేపీ నేతల సహకారం కనిపించటం లేదు.

సమీకరణాలే కీలకంగా
టీడీపీ, జనసేన కలిసినా..ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక బలమైన వర్గానికి చెందిన వారు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. వారిలో మెజార్టీ ఓట్ బ్యాంక్ వైసీపికి అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా వైసీపీ సంక్షేమ పథకాలు, విశాఖ రాజధాని అంశం ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ జగన్ వ్యూహాత్మకంగా అభ్యర్దులను ఎంపిక చేసారు.

ఉత్తరాంధ్ర సమస్యల పైన పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీగా బొత్సా ఝాన్సీకి గుర్తింపు ఉంది. ఇతర పార్టీల నుంచి ఉత్తరాంధ్ర సమస్యల పైన ఆ తరహాలో ప్రస్తావన చేయకపోవటం ఇప్పుడు ఝాన్సీకి కలిసొచ్చే అంశం. తాజాగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు బీజేపీ దూరంగా ఉండటం కూడా ఇక్కడ ఓట్ల బదిలీ పైన ప్రభావం చూపుతోంది.

గెలుపు దక్కేదెవరికి
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తున్న బీజేపీతో టీడీపీ, జనసేన కలవటం మరో ప్రతికూల పరిణామంగా మారుతోంది. టీడీపీ భరత్ సామన్య ఓటర్లను చేరుకోవటంలో సక్సెస్ కావటం లేదనే అభిప్రాయం ఉంది. స్థానిక అంశాలు, ప్రజా సమస్యల పైన భరత్ కు అవగాహన లేదనే వాదన వినిపిస్తోంది. బొత్సా కుటుంబానికి ఉత్తరాంధ్రలో ఉన్న పరపతి, చట్ట సభల్లో పని చేసిన అనుభవం ఇప్పుడు సానుకూల అంశాలుగా మారుతున్నాయి.

ఝాన్సీ తన ప్రచారంలో ప్రధానంగా స్థానిక అంశాలనే మాట్లాడుతున్నారు. టీడీపీ కూటమి కంటే ఝాన్సీ సామాన్యుల నుంచి తటస్థుల వరకు అందరినీ కలుపుకొని వెళ్లటంలో ముందంజలో ఉన్నారు. దీంతో..ప్రచారంలో వస్తున్న స్పందన, సామాజిక సమీకరణాలతో బొత్సా ఝాన్సీకి కలిసివస్తుందని..గెలుపు ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+