ఊహించని సర్‌ప్రైజ్: ఏకంగా రూ.1.09 లక్షల కోట్ల నిధుల విడుదల

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. అభివృద్ధి పనుల వేగాన్ని పెంచడమే లక్ష్యంగా భారీ ఆర్థిక సాయన్ని అందించింది. మామూలుగా ప్రతినెల ఇచ్చే పన్నుల వాటాతో సంబంధం లేకుండా, ఆగస్టు 1వ తేదీనే ఒకేసారి ఏకంగా రూ.1,09,019 కోట్లను అడ్వాన్స్ వాయిదా రూపంలో రాష్ట్రాల ఖజానాలోకి జమ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది.

సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన కేంద్ర పన్నుల వాటా నిధులు రాష్ట్రాలకు అందుతాయి. అయితే, ఈసారి ఆగస్టు 10న ఇచ్చే రెగ్యులర్ నిధులకు అదనంగా, పది రోజుల ముందే ఈ భారీ అడ్వాన్స్‌ను కేంద్రం రిలీజ్ చేసింది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, ప్రాజెక్టులు వంటి 'క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్' పనులను వేగవంతం చేయడానికే ఈ ముందస్తు పంపిణీ చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. చేతిలో సరిపడా నిధులు ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి పనుల్లో మరింత అగ్రెసివ్‌గా ముందుకెళ్తాయని కేంద్రం భావిస్తోంది.

Tax Devolution Centre Releases Rs 1 09 Lakh Crore Share to States to Boost Infrastructure Projects

ఉత్తరాదికి పెద్దపీట.. యూపీకి అత్యధిక నిధులు!

కేంద్రం విడుదల చేసిన మొత్తంలో జనాభా, ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం అత్యధిక లబ్ధి పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. యూపీకి అత్యధికంగా రూ.19,208 కోట్లు దక్కాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్‌కు రూ.10,845 కోట్లు, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రూ.8,010 కోట్లు కేటాయించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌కు రూ.7,866 కోట్లు, మహారాష్ట్రకు రూ.7,022 కోట్లు లభించాయి.

దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్!
దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్!

తెలుగు రాష్ట్రాలకు ఎంత వచ్చాయంటే..?

దక్షిణాది రాష్ట్రాలకు కూడా కేంద్ర నిధుల కేటాయింపు భారీగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు దక్కగా, కర్ణాటకకు రూ.4,504 కోట్లు, తమిళనాడుకు రూ.4,466 కోట్లు అందాయి. రాజస్థాన్ ఖాతాలో రూ.6,460 కోట్లు, ఒడిశాకు రూ.4,819 కోట్లు జమయ్యాయి. చిన్న రాష్ట్రాల విషయానికొస్తే సిక్కింకు రూ.365 కోట్లు, గోవాకు రూ.398 కోట్లు, నాగాలాండ్‌కు రూ.524 కోట్లు కేటాయించారు.

ITR ఫైలింగ్: పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే..
ITR ఫైలింగ్: పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే..

ఏమిటీ ట్యాక్స్ డెవల్యూషన్?

దేశంలో కేంద్ర ప్రభుత్వం సేకరించే వివిధ రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఒక నిర్దిష్ట శాతాన్ని రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. దీనినే ఆర్థిక భాషలో 'ట్యాక్స్ డెవల్యూషన్' అంటారు. ఫైనాన్స్ కమీషన్ నిర్దేశించిన ఫార్ములా ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో లెక్కిస్తారు. రాష్ట్రాలు తమ సొంత బడ్జెట్ నిర్వహణకు, ప్రజారోగ్య, సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేయడానికి ఈ నిధులే ప్రాణాధారం.

కాగా, ఆగస్టు 10న యథావిధిగా ఇచ్చే క్రమబద్ధమైన నెలవారీ పన్నుల వాటాను కేంద్రం వేరేగా విడుదల చేయనుంది. ఒకే నెలలో రెండుసార్లు నిధులు అందుతుండటంతో రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+