దారుణం: బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ బాలుడి కోసం గాలిస్తున్నారు.

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. వ్యాపారి వహీద్ తప్పతాగి కారు నడిపాడు. కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కేర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు, పోలీసులకు అప్పగించారు.

A boy allegedly raped a minor girl

మున్నేరువాగులోకి దూసుకెళ్లిన కారు

వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌ శివారులో ఓ కారు అదుపుతప్పి మున్నేరువాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుకి గాయాలు

హైదరాబాద్‌ నగరంలోని మొగల్‌పురా బుష్రా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. మే 11న యాస్మిన్‌ అనే మహిళ ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. అయితే సిజేరియన్‌ సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు తలపై ఘాట్లు పడ్డాయి.

శిశువుకు పూర్తి చికిత్స చేస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. అయితే డబ్బులు కడితేనే చికిత్స చేస్తామని ఆదివారం అర్థరాత్రి ఆస్పత్రి సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులు, ఆస్పత్రి సిబ్బంది మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+