చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగెత్తిన బాలుడు: ఎందుకంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం విజయవాడ నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గన్నవరం మండలం నిడమానూరులో జాతీయ రహదారిపై సీఎం కాన్వాయ్‌ వేగంగా వెళ్తుండగా.. దాని ముందు ట్రాఫిక్‌ను సరిచేస్తూ బైక్‌పై ఓ పోలీసు వెళ్లాడు.

ఈ నేపథ్యంలో ఆ పోలీసుకు సంబంధించిన టోపీ జారి రహదారిపై పడిపోయింది. సదరు పోలీసు దానిని గమనించకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఇంతలో రహదారిపై వెళ్తున్న ఓ బాలుడు.. కిందపడిన పోలీసు టోపీని తీసి సీఎం కాన్వాయ్‌తో పాటు పరుగులు పెట్టాడు.

A boy run with chandrababu naidu's convoy

'పోలీస్‌ అంకుల్‌ మీ టోపీ'అంటూ కేకలు వేస్తూ చివరికి దానిని ఆ పోలీసుకి అందజేశాడు. తన టోపీని అంతదూరం పరుగెత్తుకుంటూ వచ్చి ఇచ్చినందుకు సదరు పోలీసు.. ఆ బాలుడిని అభినందించారు. పడిపోయిన పోలీసు టోపీ విషయంలో.. తనకెందుకులే? అని అనుకోకుండా పరుగెత్తి ఆ టోపీని అప్పజెప్పడం అభినందించదగ్గ విషయమే కదా!.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+