పిల్లలతో దంపతుల సూసైడ్: టీచర్ మందలింపుతో..

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం లుంబూరు ప్రాంతానికి చెందిన రౌతు చిన్నమనాయుడు (30), అతని భార్య లక్ష్మీ ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం రాజమండ్రి పట్టణానికి వచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు తేజ (3), ఏడాదిన్నర వయస్సున్న గాయత్రి. కుటుంబంతోపాటు శేషయ్యమెట్టలో నివాసముంటున్న చిన్నమనాయుడు, రిలయన్స్ మార్ట్ బేకరిలో పని చేస్తున్నాడు.
కాగా గురువారం రోజు విధులకు సెలవు పెట్టిన చిన్నమనాయుడు ఇంట్లోనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటి యజమాని అద్దె కోసం వచ్చి తలుపు తట్టగా ఎంతకూ తీయకపోవడంతో కిటికీలోంచి చూశాడు. వారంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు గమనించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి పరిస్థితిని పరిశీలించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
టీచర్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరు: ఉపాధ్యాయుడు మందలించాడని మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థి వినోద్ ఆత్యహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం రేవూరులో చోటు చేసుకుంది. రేపూరు ఉన్నత పాఠశాల అర్థ వార్షిక పరీక్షల్లో చూసిరాత రాస్తుండగా పట్టుకున్న ఉపాధ్యాయుడు, అతన్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications