బాలికపై సిఆర్పీఎఫ్ అధికారి అత్యాచారయత్నం
హైదరాబాద్: ఓ మైనర్ బాలిక(14) పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు కామాంధుడైన సిఆర్పీఎఫ్ అధికారి. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. ముఖేష్ గోద్రా అనే సిఆర్పీఎఫ్ అధికారి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.
తనపై ఆ అధికారి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని బాధిత బాలిక చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ముఖేష్ గోద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ క్యాంపులో ఈ ఘటన జరిగింది.
డిసెంబర్ 27న ఆ బాలిక పని నిమిత్తం అక్కడికి వెళ్లింది. కాగా, ఆ సిఆర్పీఎఫ్ అధికారి తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని బాధిత బాలిక తెలిపింది.

హుక్కా సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి
కుషాయిగూడ పీఎస్ పరిధిలోని ఎన్‌జో హుక్కా సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు హుక్కా సెంటర్‌ను సీజ్ చేశారు.
బీహెచ్‌ఈఎల్‌లో కార్మికుడు మృతి
మెదక్ జిల్లాలోని ఆర్‌సిపురం వద్ద ఉన్న బిహెచ్‌ఈఎల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీహెచ్‌ఈఎల్‌లో కార్మికుడు మృతి చెందాడు. ఫర్నేస్ వద్ద కార్మికులపై క్లాంప్‌లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్ ప్రధాన గేటు వద్ద కార్మికులు












Click it and Unblock the Notifications