• search

వారంలో సర్జరీ జరగాల్సిన అమ్మాయిని..ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసిన యువకుడు

By Suvarnaraju
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    తిరుపతి :ఆ అమ్మాయి బిటెక్ చదువుతోంది. కానీ కిడ్నీ సమస్య కారణంగా ప్రాణాపాయ స్థితి ఎదుర్కొంటోంది. అయితే జూన్ 8 న ఆమెకు ఆపరేషన్ చేయాల్సివుంది.
    ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు.

    ఆరా తీస్తే ప్రేమిస్తున్నానంటూ తమ కుమార్తె వెంటపడిన ఒక యువకుడు ఈమెని పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని తెలిసింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని వెతికి పట్టుకొచ్చారు. ఆ అమ్మాయి మైనర్ కావడంతో అబ్బాయిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి అమ్మాయిని తల్లిదండ్రులకుఅప్పగించారు. వివరాల్లోకి వెళితే...

    A different love story: A young man who kidnapped the patient to be operated within a week

    పోలీసుల కథనం ప్రకారం...నెల్లూరు జిల్లా చేజర్ల మండలం, నాగులవెల్లటూరుకు చెందిన రాజేష్‌ అనే యువకుడు విజయవాడలోని ఓ ప్రయివేట్‌ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. రాజేష్‌ తరచూ తిరుపతిలో చికెన్‌ షాప్‌ నిర్వహిస్తున్న తన అన్న చక్రవర్తి ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో తమ షాపు సమీపంలోనే నివాసం ఉండే బీటెక్‌ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది.

    అయితే రాజేష్ ప్రేమిస్తున్న అమ్మాయి ఒక కిడ్నీ పేషెంట్...ఆమెకు ఒక కిడ్నీ పూర్తిగా పాడవడంతో ఈ నెల 8 న వేలూరు సిఎంసి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయాల్సి వుంది. తల్లిదండ్రులు ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాజేష్ అమ్మాయి చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు వెళ్లి నువ్వులేకుండా నేను ఉండలేనంటూ...మనం పెళ్లి చేసుకుందామని చెప్పి అట్నుంచి అటే తీసుకెళ్లిపోయడు.

    అమ్మాయి కాలేజ్ నుంచి ఇంటికిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా రాజేష్ తమ కుమార్తెను తీసుకెళ్లిన సంగతి తెలిసింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురిని రాజేష్‌ మాయమాటలతో వంచించి కిడ్నాప్‌ చేశాడని తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరు పోలీసులు రాజేష్ ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న రాజేష్ ను, ఆ యువతిని ఎస్కార్ట్‌పై తిరుపతి తీసుకువచ్చి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులకు అప్పగించారు.

    దీంతో ఈస్ట్‌ పోలీసులు రాజేష్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే వారం రోజుల్లో ఆపరేషన్ జరగాల్సివున్న అమ్మాయిని రాజేష్ కిడ్నాప్ చేయడంతో పెద్ద సంఖ్యలో యువతి తరుపు బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ స్థితిలో ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు రాజేష్‌ ప్రయత్నించడంపై యువతి బంధువులతో పాటు పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    A young man who kidnapped the patient to be operated within a week created a sensation in Tirupati.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more