యువతులతో నగ్న పూజలు: నకిలీ బాబా అరెస్ట్
నెల్లూరు: జిల్లాలోని ఆదిత్యనగర్‌లో ఓ నకిలీ బాబా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఓ ఇంట్లో యువతితో నగ్నపూజలు చేయిస్తుండగా ఆ నకిలీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా యువతులను మోసం చేసి, వారికి నమ్మబలికి వారిచే నగ్నపూజలు చేయించి అనంతరం వాటిని వీడియో చిత్రీకరించి బ్లాకమెయిల్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

గుట్టుచప్పుకాకుండా నడుపుతున్న వ్యభిచార గృహంపై మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. నాలుగో నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని హరనాథపురం ఐదో వీధిలో సాదా సుబ్బరత్నమ్మ అనే మహిళ గత కొంత కాలంగా వ్యభిచార గృహం నడుపుతోంది. ఆమె షేక్, జరీనా, బూదగుంట సుగుణలను బ్రోకర్లుగా ఏర్పాటు చేసుకుని విటులను ఆకర్షిస్తోంది.
అంతేగాకుండా ఇతర జిల్లాలు, నగరాలలోని యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. ఈ మేరకు స్థానికులు కొందరు 4వ నగర పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం రాత్రి ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు.
ఈ దాడుల్లో నిర్వాహకురాలు సుబ్బరత్నమ్మ, జరీనా, సుగుణలతోపాటు తిరుపతికి చెందిన బాబు, చెన్నూరుకు చెందిన సుందరరావు అనే విటులు, మరో ఇద్దరు యువతులను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరు కట్టాసుబ్బారావుగారి వీధిలో చేపల వ్యాపారి లంకపల్లి సత్యనారాయణ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుమాస్తాలు మోసం చేయడంతో సత్యనారాయణ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య రాజేశ్వరి ఆరోగ్యం నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications