పవన్‌ షాక్: గట్టిగా కౌగలించుకుని వదలని అభిమాని, ‘ఈలలు వేయొద్దు’

అనంతపురం: రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే తాను అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. శనివారం ఉదయమే ఆయన అనంతపురం చేరుకుని పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసశారు.

Recommended Video

    అనంతపురం లో పవన్ కళ్యాణ్: సర్వం సిద్ధం

    అనంతరం తన పర్యటన సందర్భంగా ఆయన పలువురు రైతులు, వ్యవసాయ, నీటిపారుదల రంగ నిపుణులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. అనంతపురంలో కరవు పరిస్థితులపై చాలా మందితో మాట్లాడానని పవన్ తెలిపారు. అలాగే కొందరు మేధావులతోనూ ఈ సమస్యపై చర్చించినట్టు చెప్పారు.

     అందుకే మీ ముందుకు

    అందుకే మీ ముందుకు

    కరువు నివారణ చర్యలు, సాగులో జాగ్రత్తలు అంశంపై నిపుణులు సలహాలు ఇస్తారని చెప్పారు. రాష్ట్రం మేలు కోరే వ్యక్తిగా తాను అనంతపురం జిల్లా ప్రజల ముందుకు వచ్చానని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

    ఈలలు వేయొద్దు

    ఈలలు వేయొద్దు

    మేధావులు ఇచ్చిన సలహాలు, సూచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్‌ హామీ ఇచ్చారు. తాను మాట్లాడుతుండగా కొందరు ఈలలు వేయడంపై పవన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బతుకు సమస్యకు సంబంధించిన అంశంపై చర్చిస్తున్నప్పుడు దయచేసి ఈలలు వేయవద్దని అభిమానులకు ఆయన సూచించారు.

     అభిమాని హల్చల్

    అభిమాని హల్చల్

    కాగా, పవన్ అనంతపురం జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పవన్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికెళ్లినా భారీగా అభిమానులు తరలివస్తారనే విషయం తెలిసిందే. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్‌ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురిచేసింది.

    పవన్‌ని హగ్ చేసుకుని వదలని అభిమాని

    పవన్‌ని హగ్ చేసుకుని వదలని అభిమాని

    అభిమానులను కట్టడి చేస్తున్న పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్‌ను గుండెలకు హత్తుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు షాకయ్యారు. కాసేపటికి వరకూ వదలకపోవడంతో.. అతనిని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ అభిమాని అక్కడ్నుంచి కదల్లేదు.

     అభిమానానికి లొంగిన పవన్.. సెల్ఫీ తీశాడు

    అభిమానానికి లొంగిన పవన్.. సెల్ఫీ తీశాడు

    పవన్‌తో సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపాడు. అతని అభిమానానికి ఫిదా అయిన పవన్.. అతని సెల్‌ఫోన్ తీసుకుని స్వయంగా పవనే సెల్ఫీ తీశాడు. ఆ తర్వాతే అక్కడ నుంచి ఆ యువకుడు వెళ్లిపోయాడు. పవన్‌ను హత్తుకుని, సెల్ఫీ దిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆ అభిమాని హర్షం వ్యక్తం చేశాడు. ఓ అభిమాని పట్ల పవన్ చూపిన అభిమానాన్ని చూసి అక్కడివారంతా సంతోషం వ్యక్తం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+