TTD: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం, ఏం జరిగింది ?
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన విధానం విభాగం కార్యాలయం తిరుపతిలో ఉంది. తిరుపతి నగరంలో టీటీడీ భవనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాల విభాగం కార్యాలయం నుంచి టీటీడీ కార్యకలపాలుల నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలన భవనంలోనే టీటీడీ ఈవో తోపాటు అన్ని విభాగాల అధికారుల కార్యాలయాలు ఉన్నాయి.
తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలన విభాగం కార్యాలయానికి భారీ బందోబస్తు కూడా ఉంది. శనివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అనేక ఫైల్స్ ఖాళి దగ్ధమయ్యాయి సమాచారం. టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన ఫైల్ ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. అగ్నిప్రమాదంపై టీటీడీ పరిపాలన భవనం ఉద్యోగి నాగార్జున పై అధికారులకు సమాచారం ఇచ్చాడు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపు మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. టీటీడీ పరిపాలన విభాగం కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో తిరుపతిలోని అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. టీటీడీ పరిపాలనా విభాగం భవనంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయా ?, మరేదైనా కుట్ర కోణం ఉందా అంటూ పలు కోణాలలో అలిపిరి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇటీవల ఆదివారం రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించి 22ఏ సెక్షన్ లోని కంప్యూటర్లు, ఫైల్స్ ఖాళి బూడిద కావడంతో కేసు నమోదు చేశారు. కుట్రకోణంలోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్ మీద చర్యలు తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications