కుండపోత - అస్తవ్యస్తం, తాజా హెచ్చరిక..!!

ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాల పైన అలర్ట్ జారీ అయింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసారు. లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు జలాశయాలకు వరద పెరుగుతోంది. రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నదులతో పాటు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీవర్షాల నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖపట్నంలో కొండవాలు ప్రాంతాలకు ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

A flood alert was issued in north coastal and Godavari following heavy rains

తాజా హెచ్చరికలు
మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో నీటిమట్టం 55 అడుగులకు చేరడంతో సోమవారం ఉదయం ఒక గేటు ఎత్తనున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. అనకాపల్లి జిల్లాలో రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ, తాండవ జలాశయాలకు వరద తాకిడి పెరిగింది. దీంతో స్పిల్‌గేట్లు ఎత్తి, అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శారదా, పెద్దేరు, బొడ్డేరు, వరహా, సర్పా, తాండవ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఛిద్రమైన రహదారులు.. వర్షాలతో మరింత దారుణంగా తయారయ్యాయి.

అప్రమత్తం
వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో అనేక గ్రామాలను వరద నీరు చుట్టివేసింది. కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్‌ మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఎగువ నుంచి బుడమేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరుచేరడంతో ఈ ముంపు మరింత పెరిగి గ్రామాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, గోదావరిలోకి అదనంగా వస్తున్న 6,11,196 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. భారీవర్షాలతో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో విశాఖ విమానాశ్రయానికి వచ్చి, వెళ్లాల్సిన ఆరు విమానాలు ఆలస్యంగా నడిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+