ఆ హీరోపై దాడికి విఫలయత్నం?: పోలీసులకు తమ్ముడి ఫిర్యాదు

చిత్తూరు: హీరోపై దాడికి విఫలయత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కడితో మొదలైంది సినిమా హీరో మోహన్‌పై దాడిచేసేందుకు ప్లాన్ చేసుకున్న ఓ ముఠా.. శనివారం రాత్రి కర్రలు, కత్తులతో గంగవరం మండలం నల్లగుట్లపల్లెలో హల్ చల్ చేశారు.

నల్లగుట్లపల్లెకు చెందిన మోహన్ తమ్ముడు శివశంకర్ కారులో బెంగళూరుకు బయలుదేరిన సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను అడ్డగించారు. కారులో తనిఖీ చేశాక.. మోహన్ లేడని నిర్దారించుకుని తనను వదిలేశారని శివశంకర్ తెలిపారు. ఆ ముఠా జరిపిన దాడిలో తన కారు అద్దం పగిలినట్టు శివశంకర్ చెప్పారు.

a gang tries attack on telugu hero mohan

ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషనులో శివశంకర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ముఠాను పట్టుకోవడం కోసం పోలీసులు శనివారం రాత్రి పలుచోట్ల గాలించగా.. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తన అన్న మోహన్ గోవాబీచ్ అనే సినిమాలో నటిస్తున్నాడని శివశంకర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+