ప్రేమంటే ఇంతేనేమో: చలపతిరావు అతడ్నే పెళ్లాడతాడు!

కౌలాలంపూర్: అవును అతని పేరు చలపతిరావు. అతను కొంత కాలం క్రితం తనకు ఫేస్‌బుక్ పరిచయమైన ఫ్రెండ్ ప్రేమలో పడ్డాడు. అంతే ఇంకేముందు ఆ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకున్నాడు.

అయితే, వీరి పెళ్లికి మొదట అతని తల్లిదండ్రులు ఏమాత్రం అంగీకరించలేదు. ఎందుకంటే అతడు ప్రేమించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఓ యువకుడు. అయినా పట్టువదలకపోవడంతో చేసేదేమీ లేక చివరకు అతని తల్లిదండ్రులు కూడా ఆ పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది.

gay

ఆ వింత వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నానికి చెందిన చలపతిరావు(22) కుటుంబం కొన్నేళ్ల క్రితం మలేషియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పెరిగి పెద్దయిన చలపతిరావుకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కాగా, ఇతనికి ఫేస్‌బుక్ ద్వారా అమెరికాకు చెందిన జాన్ మెక్ కేనేతో పరిచయం ఏర్పడింది.

అంతేగాక, వీరి ఇద్దరి మనోభావాలు, అభిప్రాయాలు కూడా కలిశాయి. కొంతకాలం తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న చలపతిరావు తల్లిదండ్రులు తమ కొడుకు పరిస్థితిపై ఆందోళన చెందారు.

మొదట వీరి పెళ్లికి వ్యతిరేకించినా.. తర్వాత ఇష్టంలేకపోయినప్పటికీ కొడుకు కోసం అంగీకరించారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం చలపతిరావు-జాన్‌ల ఎంగేజ్ మెంట్ ఘనంగా నిర్వహించారు. త్వరలో వీరిద్దరు పెళ్లితో ఒక్కటవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+