దారుణం: యువతిపై ప్రియుడు, స్నేహితుల గ్యాంగ్‌రేప్, వ్యభిచార గృహాలకు అమ్మేశారు
తూర్పుగోదావరి: రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ యువతి(14) తన ప్రియుడి దగ్గరకు వెళ్లింది. అతడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేగాక, ఆ తర్వాత ఆ యువతిని పశ్చిమగోదావరి జిల్లాలోని పలు వ్యభిచార గృహాలకు రోజులచొప్పున అమ్మేశాడు. సెప్టెంబర్ 11న ఇంటి నుంచి వెళ్లిన కూతురు తిరిగిరాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న బేగం అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుని విచారించారు.

ఆమెను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు కూడా ఆమె వద్దే ఉండటంతో ఆమెను పోలీసులు విడిపించారు. ప్రేమించిన వ్యక్తి కదా అని వెళితే.. తనను అతని స్నేహితులతో అత్యాచారం చేయించాడని బాధితురాలు వాపోయింది.
అంతేగాక, తనను వ్యభిచార గృహాలకు అమ్మేశాడని ఆమె తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications