Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మద్యం తాగించి స్టార్ హోటల్ ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్

విశాఖపట్నం నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్టార్ హోటల్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

విశాఖపట్నం: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్టార్ హోటల్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

గతంలో ఆ స్టార్ హోటల్లో పని చేసిన శ్రీధర్ అనే యువకుడు, అతని స్నేహితుడితో కలిసి యువతికి మద్యం తాగించి వుడా పార్క్ సమీపంలో అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు.

A girl allegedly gangraped by two youths in visakhapatnam

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

సముద్రంలో బాలుడి గల్లంతు

సముద్ర స్నానానికి వెళ్లిన 15 ఏళ్ల బాలుడు రామకృష్ణబీచ్‌ వద్ద గురువారం మధ్యాహ్నం గల్లంతయ్యాడు. నగరంలోని రైల్వే న్యూకాలనీకి చెందిన ఇండిపల్లి వెంకటరమణ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం రామకృష్ణబీచ్‌లో కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న సముద్రంలో స్నానం చేశాడు.

ఈ సమయంలో అలల ధాటికి వెంకటరమణ గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురు బాలలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గల్లంతైన బాలుడిని రక్షించేందుకు బీచ్‌ లైఫ్‌ గార్డులు ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోయింది.

వెంకటరమణ ఆచూకీ కోసం మధ్యాహ్నం నుంచి ప్రయత్నిస్తున్నా దొరకలేదని పోలీసులు తెలిపారు. కుమారుడి కోసం రామారావు అతని భార్య, ఇతర కుటుంబసభ్యులు సముద్రం ఒడ్డున కన్నీరుమున్నీరుగా విలపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+