"పెద్ది" సక్సెస్ ఈవెంట్‌కి టైమ్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఆయనే !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం "పెద్ది". 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మించారు.
ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించి అద్బుత విజయాన్ని అందుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి ఘోర పరాభవం తర్వాత రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ హిట్ కొట్టడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రం.. ఇప్పుడు మరో భారీ సెలబ్రేషన్‌కు సిద్ధమైంది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయానికి కృతజ్ఞతగా, అభిమానుల సమక్షంలో జూన్ 23వ తేదీన (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని ప్రముఖ 'శిల్పకళా వేదిక' లో ఒక భారీ 'మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' అత్యంత వైభవంగా జరగనున్నట్టు అనౌన్స్ చేశారు.
ఇందుకు సంబంధించి మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ ఇన్విటేషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ రగ్గడ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డం, పవర్‌ఫుల్ మజిల్స్‌తో 'పెహల్వాన్' అవతారంలో చరణ్ కనిపిస్తున్నారు. అలానే ఆయన ధరించిన జెర్సీపై "PEDDI 27" భారత జాతీయ పతాకం స్పష్టంగా ఉన్నాయి. చేతిలో గోల్డ్ మెడల్ పట్టుకుని చూడవచ్చు.
ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టులుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సుమారు రూ.105 కోట్ల భారీ ధరకు దీని డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. జూలై ఆఖరులో రాబోయే ఈ ఓటీటీ వెర్షన్‌లో థియేటర్ కట్స్ కూడా కలిపి, ఏకంగా 3 గంటల 25 నిమిషాల ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు.
Let's celebrate the BOX OFFICE CHAMPION ❤🔥#PEDDI MEGA BLOCKBUSTER EVENT on June 23rd 💥
— PEDDI (@PeddiMovieOffl) June 21, 2026
📍Shilpakala Vedika from 6 PM onwards https://t.co/kRZnoFfbWw
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/wdUo9vyMYq












Click it and Unblock the Notifications