నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పడి చిన్నారి మృతి
హైదరాబాద్: నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి ఓ కుటుంబం తిరుపతికి వెళ్లుండగా ఈ దారుణం జరిగింది.
తిరుపతి వెళ్తుండగా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి చిన్నారి జారి కిందపడింది. బాత్రూంకు వెళ్లిన తమ కూతురు తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. బాత్రూంతోపాటు ఇతర బోగీలలోనూ వెతికారు.

అయినా ఫలితం లేకపోయింది. అంతలోనే రైలు 2.కి.మీల దూరం వెళ్లిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులను ఆరాతీసి, రైలు చైన్ లాగి రైలును ఆపేశారు. కాగా,
బాత్రూం వద్ద రైలు బోగీల మధ్య ఉన్న సంధులోంచి ఆ చిన్నారి కిందపడిపోయినట్లు తెలుస్తోంది.
కావలి-శ్రీవెంకటేశ్వరపాలెం వద్ద ఆ చిన్నారిని రైల్వే సిబ్బంది గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. చిన్నారి మృతి చెందిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు రైల్వే పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. చిన్నారి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications