టీ కొట్టు ప్రేమ : 'న్యూడ్ ఫోటోలతో పోస్టర్లు'
విశాఖపట్నం : టీ కొట్టులో పరిచయం.. మెల్లిగా మాటా మాటా కలిపాడు. పెద్దగా లోకజ్నానం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. విషయం అందరికీ తెలిసి పంచాయితీ పెట్టడంతో.. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. ఆ తర్వాత దర్జాగానే ఓ అల్లుడి తరహాలో రాకపోకలు సాగించాడు. మోజు తీరిందో.. ఇక డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామనుకున్నాడో గానీ మొత్తానికి ప్రేమ లేదు పెళ్లి లేదు దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు.
ఇప్పుడా బాధితురాలిది దిక్కు తోచని స్థితి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యాతపాలేనికి చెందిన వరలక్ష్మి టీ కొట్టు నడుపుతూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. ఇదే క్రమంలో స్థానికంగా క్లీనర్ గా పనిచేసే చుక్కా పెద్దన్న (22) తరుచూ టీ కొట్టుకు వస్తుండేవాడు.
అలా.. టీ కొట్టుకు వచ్చిన ప్రతీసారి తొమ్మిదో తరగతి చదువుతోన్న వరలక్ష్మి కుమార్తెతో మాటలు కలిపాడు. ప్రేమ పేరుతో ఆ బాలికకు దగ్గరయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్లి.. 'కాబోయే భర్తనే కదా..! ఎందుకు బిడియం' అంటూ ఆమెను లొంగదీసుకునేవాడు. అలా ఇద్దరీ వ్యవహారం స్థానికుల కంట పడడంతో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ పెద్దల ముందు ఆ బాలికను తాను పెళ్లి చేసుకుంటున్నానని ఒప్పుకున్నాడు.

అయితే బాలిక మైనర్ కాబట్టి.. మేజర్ అయిన వెంటనే పెళ్లి చేసుకుంటాడని అతని తల్లిదండ్రులు కూడా మాటిచ్చారు. ఇక అప్పటినుంచి దర్జాగానే ఆ ఇంటికి రాకపోకలు సాగించిన పెద్దన్న, కొన్నాళ్లుగా మొహం చాటేస్తు వస్తున్నాడు. ఫోన్ చేస్తే.. స్విచ్చాఫ్. ఇదేంటని నేరుగా వెళ్లి నిలదీస్తే.. "నీకు దిక్కున్న చోట చెప్పుకో పో అనడం మొదలుపెట్టాడు. పై పెచ్చు.. ఆ బాలిక శృంగార ఫోటోలను, నగ్న వీడియోలను ఊరంతా పోస్టర్లుగా అంటిస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు".
అసలే పేదరికం.. తోడుగా ఉంటాడనుకుని చనువిస్తే.. ఇలా మోసగించేసరికి ఏం చేయాలో అర్థంగాక పోలీసులను ఆశ్రయించింది వరలక్ష్మి. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు పోలీసులు.












Click it and Unblock the Notifications