బిట్రగుంట రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్లకు తీవ్ర అంతరాయం..
ఇటీవల దేశంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా పెరిగిపోయాయి. దీంతో రైల్లో ప్రయాణించాలంటేనే చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ, తప్పనిసరి పరిస్థితిల్లో సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రైలు ప్రయాణాలనే ఎంపిక చేసుకుంటున్నారు. దేశంలో ఇప్పటివరకూ ఎన్నో రైలు ప్రమాదాలు జరిగినా, వాటి నివారణకు మాత్రం అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇప్పుడు తాజాగా, నెల్లురూ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. నేటి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ ట్రైన్ నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు సమాచారం.

ఈ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపు ఉన్న 144వ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో అక్కడ రోడ్ ట్రాఫిక్ ఏర్పడింది. పలు రైళ్లరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వెంటనే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, రోడ్ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు తగు చర్యలు చేపట్టారు. అత్యవసర రైళ్లను మూడో లైన్‌లోకి పంపించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు మిగిలిన రైళ్లకు కూడా అంతరాయం లేకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడవైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు. కొద్ది గంటల సమయంలో రైళ్ల రాకపోకలు యాథావిధిగా ఉంటాయని అధికారుల సూచించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications