శిశువు అపహరణ: ఛేదించిన పోలీసులు, అరెస్ట్(ఫొటో)

విశాఖపట్నం: నగరంలోని కెజిహెచ్ గైనిక్ వార్డులో రెండు రోజుల శిశివు అదృశ్యమైన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ ఏసిపి డిఎన్ మహేష్ తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. మే 19న తెల్లవారుజామున వాసుపల్లి గుణ గైనిక్ వార్డులో మగబిడ్డకు జన్మనిచ్చింది. 21వ తేదీ అర్ధరాత్రి నుంచి తల్లికి శిశువు కనిపించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

మల్కాపురం ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన మతల బేబీరాణికి పెళ్లై నాలుగేళ్లయినా పిల్లలు కాలేదు. కెజిహెచ్ లో స్వీపర్‌గా పని చేస్తున్న బంగారి ప్రభావతితో ఆమెకు పరిచయం ఉంది. పెంచుకోవడానికి అనాథ పిల్లలెవరైనా ఉంటే చూడమని, డబ్బులిస్తానని ప్రభావతితో బేబీరాణి చెప్పింది. ప్రభావతి ఈ విషయాన్ని లేబరు రూంలో ఆయా అయిన కృష్ణవేణికి చెప్పింది. కృష్ణవేణి.. బేబీరాణితో రూ. 30వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆమెతోపాటు ప్రభావతి, మార్చురీలో పని చేస్తున్న ముదిలి అప్పలనాయుడు, బాలరాజు, కలిసి ఆ శిశువు అపహరణకు పూనుకున్నారు.

A group arrested for theft a child

అర్ధరాత్రి సమయంలో శిశువు, తల్లి నిద్రిస్తున్న వేళ అప్పలనాయుడు వార్డులోకి ప్రవేశించి శిశువును గోడ దాటించాడు. అక్కడ నుంచి బాలరాజు, కృష్ణవేణి, ప్రభావతిలు మార్చురీ వద్ద దుప్పట్లో శిశువును దాచారు. అక్కడ నుంచి ఆటోలో శిశువును తీసుకెళ్లి మల్కాపురంలోని బేబీరాణి వద్ద రూ. 30వేలు తీసుకుని ఆమెకు శిశువును అప్పగించారు.

ఇది ఇలా ఉండగా దర్యాప్తులో భాగంగా పోలీసులు ముందుగా కుటుంబ సభ్యులు, స్నేహితుల్లోనే ఎవరో శివువును అపహరించి ఉంటారని భావించి ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఆస్పత్రిలోని సిసి కెమెరాల ఫుటేజీలను సిఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్ పరిశీలించారు. శిశువు అపహరణకు గురైన సమయంలో ఒక వ్యక్తి వార్డు నుంచి చేత్తో ఏదో పట్టుకొని వెళుతున్నట్లు కనిపించింది. వెంటనే వార్డు సిబ్బందిని పిలిపించి ఆ వ్యక్తి ఎవరని ప్రశ్నించగా.. మార్చురీలో పని చేస్తున్న అప్పలనాయుడు అని చెప్పడంతో దర్యాప్తు వేగవంతం చేశారు.

అప్పలనాయుడును విచారించడంతో కేసు చిక్కుముడి వీడింది. బేబీరాణి వద్ద నుంచి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లికి సురక్షితంగా అప్పగించారు. కేసులో నిందితులైన బేబీరాణి, ప్రభావతి, కృష్ణవేణి, రాజు, అప్పలనాయుడులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసును ఛేదించిన సిఐ సయ్యద్ ఇలియాస్, ఎస్ఐ వాసుదేవరావు, ఇతర సిబ్బందికి రివార్డు అందించారు ఇంఛార్జ్ నగర పోలీసు కమిషనర్ ఉమాపతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+