వేరే మహిళతో భర్త రాసలీలల్లో, రెడ్ హ్యండెడ్ గా పట్టుకొన్న భార్య
విడాకులు ఇచ్చేయమంటూ భార్యను వేధించడమే కాకుండా తన ఆత్మహత్యాయత్నానికి భార్యే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ ను సోమవారం రాత్రి విజయవాడ పోలీసు
విజయవాడ: విడాకులు ఇచ్చేయమంటూ భార్యను వేధించడమే కాకుండా తన ఆత్మహత్యాయత్నానికి భార్యే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ ను సోమవారం రాత్రి విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన కానిస్టేబుల్ అదే ప్రాంతానికి చెందిన వివాహితతో సింగ్ నగర్ షాదీఖానా సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
అయితే తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని గమనించిన భార్య పోలీసులకు పట్టించింది.

భట్టిప్రోలు గ్రామానికి చెందిన రాజేష్ బాబుకు రాణితో ఎమిమిదేళ్ళ క్రితం వివాహమైంది.అయితే ఆ సమయంలో కట్న కానుకల కింద రూ.3 లక్షలు ఇచ్చారు. ఇతర లాంఛనాలను కూడ అందించారు. పెళ్ళి సమయానికి రాజేష్ మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసి భార్య నిలదీయడంతో భర్తతోపాటు అత్త , మరిది వేధింపులు ప్రారంభించారు. వీరి వేధింపులు నుండి రక్షణ కల్పించాలని భార్య రాణి భట్టిప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాది డిసెంబర్ లో రాజేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు మంగళగిరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
తనపై అక్రమంగా కేసు పెట్టిన భర్తపై రాణి నిఘా పెట్టింది. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా సమీపంలో మరో మహిళతో రాజేష్ ఉంటున్నాడని గుర్తించింది. కుటుంబసభ్యుల సహకారంతో అజిత్ సింగ్ నగర్ పోలీసులకు పట్టించింది. కానిస్టేబుల్ ను వివాహితను పోలీసులు విచారిస్తున్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహారించుకోవడంతో పాటు తన కాపురాన్ని పోలీసులు చక్కదిద్ది న్యాయం చేయాలని రాణి కోరుతోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications