ఏం జరిగిందో?: మహిళా వైద్యురాలు ఆత్మహత్య, విషాదంలో టెక్కీ భర్త
విశాఖపట్నం: నగరంలోని శివాజీపాలెంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమోగానీ ఓ మహిళా ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యురాలు దీప.. శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా అన్ని పనులు ముగించుకుని ఆస్పత్రికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్ వెతుక్కోవాలని తన గదిలోకి వెళ్లింది.

కాగా, దీప ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. మృతురాలి భర్త ప్రవీణ్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతురాలి సోదరుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేదు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications