భర్తను వదిలి ప్రియుడితో సహాజీవనం, పెళ్ళిచేసుకోవాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వివాహమైనా భర్తను వదిలేసి ప్రియుడితో సహాజీవనం చేస్తోంది,అయితే ప్రియుడిని వివాహం చేసుకోవాలని వత్తిడి తేస్తోంది.అయితే ప్రియుడు భర్త నుండి విడాకులు తీసుకొంటేనే వివాహం చేసుకొంటానని తేగేసి చెప్పాడు.అయితే ప్

గుంటూరు: వివాహమైనా భర్తను వదిలేసి ప్రియుడితో సహాజీవనం చేస్తోంది,అయితే ప్రియుడిని వివాహం చేసుకోవాలని వత్తిడి తేస్తోంది.అయితే ప్రియుడు భర్త నుండి విడాకులు తీసుకొంటేనే వివాహం చేసుకొంటానని తేగేసి చెప్పాడు.అయితే ప్రియుడిపై ఒత్తిడి పెంచేందుకుగాను ఓ వివాహిత సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించింది.

కర్నూల్ జిల్లా జలదుర్గం మండలం త్యాప్లి గ్రామానికి చెందిన వివాహిత పఠాన్ షాహినాకు కనమర్లపూడి గ్రామానికి చెందిన లాజర్ తో ఏడాది క్రితం పరిచయమైంది.అయితే షాహినాకు అప్పటికే వివాహమైంది.

అయినా ఆమె భర్తను వదిలేసి లాజరుతో కనమర్లపూడికి వచ్చింది.ఆయనతో సహాజీవనం చేస్తోంది.అయితే ప్రియుడితో సహాజీవనం సాగిస్తున్న షాహినా అతడిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

protest

అయితే భర్త నుండి విడాకులు తీసుకురావాలని షాహినాకు ప్రియుడు లాజర్ చెప్పాడు. దీంతో విడాకులు తీసుకురాకున్నా తనను పెళ్ళి చేసుకోవాలని షాహినా లాజర్ పై ఒత్తిడి చేయాలని నిర్ణయానికి వచ్చింది.

దీంతో సెల్ టవర్ ఎక్కి ఆమె నిరసనకు దిగింది. సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగిన ఆమెను గ్రామస్థులు నచ్చజెప్పేప్రయత్నం చేశారు. పోలీసులురంగ ప్రవేశం చేయడంతో ఆమె సెల్ టవర్ దిగింది. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+