ప్రేమజంటపై దుండగుల దాడి: ప్రియుడ్ని బంధించి యువతిపై రేప్
గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేమూరు రైల్వేస్టేషన్ సమీపంలో ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో యువకుడిని బంధించి యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితుల ఈ సంఘటనపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదం:10 మందికి గాయాలు
నెల్లూరు: వేగంగా వెళ్తున్న కారు సాంకేతికలోపంతో ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని చిల్లకూర్ మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద బుధవారం జరిగింది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తుండగా బూదనం టోల్ ప్లాజాకు చేరుకోగానే బస్సు ముందు ప్రయాణిస్తున్న కారు ఒకసారిగా ఆగిపోయింది. దీంతో బస్సుకు కారుకు మధ్యలో ఉన్న ఆటోను బస్సు ఢీ కొట్టింది. ఇంతలో వెనుక వచ్చిన లారీ, బస్సును ఢీ కొట్టింది.
దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు, బస్సులోని 7గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications