తుఫాన్ దూసుకొస్తోంది, ఈ జిల్లాలపై భారీ ప్రభావం- తాజా హెచ్చరికలు..!!
మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంథా తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించగా.. ప్రస్తుతం సెనియార్ తుఫాన్ ఏపీవైపుకు దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమ వారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుపానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఈ తుఫానుకు 'సెన్‌యార్' గా వాతావరణ శాఖ పేరు ఖరారు చేసింది. అయితే, తుపాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశముందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబరు 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కాగా, కే మొంథా తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది.

మరోవైపు వాతావరణ శాఖ అధికారులుసైతం హెచ్చరికలు జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో చలి కాస్త తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో మరో తుపాను సమాచారం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications