మరో వాయు"గండం " - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
ఏపీని వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.గత పది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంట దెబ్బతింది. తాజాగా మరో సారి వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 2 రోజుల్లో మరింత బలపడి తమిళనాడు రాష్ట్ర తీరం వైపు ప్రయాణించనుంది. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారాల్లో తమిళనాడు, ఏపీ లోని ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ నెల 17న అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని మరో హెచ్చరిక జారీ అయింది. ఇటు రాష్ట్రంలో ఇప్పటికే చలి గాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 16 డిగ్రీల కంటే దిగువన నమోదు అయ్యాయి.
సోమ, మంగళవారాల్లో అరకు, సాలూరు తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య రుతు పవనాలు చురుకుగా కదులుతుండటంతో వరుసగా అల్పీ పీడనా లు ఏర్పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఈ నెల చివరి వరకు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications