మళ్లీ ముంచుకొస్తోంది, బిగ్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లో ఇక భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. కొద్ది రోజులు ఎడ తెరపి లేకుండా కురిసిన వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో ఆగస్టు 25 నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీకి వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. అల్ప పీడనం ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. ఈనెల 25న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దాని ప్రభావంతో 26 నుంచి ఉత్తర కోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ, ఉక్కపోత కొనసాగాయి. బాపట్లలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

A low-pressure system has formed over Bay of Bengal IMD alerts heavy rains

దీంతో రాష్ట్రం మొత్తం మీద నైరుతి-పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడవచ్చని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణా, గోదావరి నదులు శాంతిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.50 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+