పెళ్లెలా చేసుకుంటావ్?: నిశ్చితార్థం రద్దుకు రివేంజ్, ఫేస్‌బుక్‌లో యువతి అసభ్య ఫొటోలు

కడప: తనతో నిశ్చితార్థం రద్దు చేసుకున్న ఓ యువతిని లక్ష్యంగా చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. 'నీకు పెళ్లెలా ఎలా అవుతుందో చూస్తానంటూ' ఆమెకు పలుమార్లు బెదిరింపులకు గురిచేశాడు. అంతేగాక, ఫేస్‌బుక్ అసభ్యకర వ్యాఖ్యానాలు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న దంపతులు తమ కుమార్తెను అనంతపురంలో నివాసముంటున్న వారి దూరపు బంధువు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న శివకృష్ణకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో 2014 అక్టోబర్ 24న వారిద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే, నిశ్చితార్థం రోజే శివకృష్ణ యువతి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. పెళ్లికి ముందే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.. ఇక పెళ్లి తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో యువతి కుటుంబ సభ్యులందరూ చర్చించుకొని వారం రోజుల తర్వాత నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు శివకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో అతను నిశ్చితార్థం అయితే సగం పెళ్లి అయినట్లేనని చెబుతూ ప్రతి రోజూ ఆ యువతి ఇంటికి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. తనకు ఇచ్చి వివాహం చేయకుంటే మీ కుమార్తెకు ఎవరితోనూ పెళ్లి కాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

అంతేగాక, అవసరమైతే ఆమెను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటానని హెచ్చరించాడు. ఇలా ఏడాదిన్నర నుంచి అతను అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. కాగా, ఇటీవల అతడు ఫేస్‌బుక్‌లో అసభ్యకర వ్యాఖ్యలు, ఫొటోలు పోస్టు చేశాడు.

A man allegedly harassed a girl in Kadapa

ఫేస్‌బుక్‌లో నిశ్చితార్థం ఫొటోలతో పాటు శివకృష్ణ- ఆ యువతి ప్రేమించుకున్నట్లు మెసేజ్‌లు ఉన్నాయి. ఇలా నిత్యం అసభ్యకర మెసేజ్‌లన్నీ పోస్టు చేస్తూ యువతి బంధువుల అకౌంట్‌లకు ట్యాగ్ చేసేవాడు. అసభ్యకరమైన ఫొటోలకు ఆమె ముఖాన్ని జోడించి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు శివకృష్ణకు ఫోన్ చేసి నిలదీయగా తనకు తెలియదని బుకాయించాడు.

ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 22న టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో శివకృష్ణకు ఎస్‌ఐ ఫోన్ చేసి మందలించారు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మార్చి 1న కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+