అనుమానం: భార్యపై కిరోసిన పోసి నిప్పుపెట్టిన భర్త

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురంలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే అనుమానపు పిశాచై భార్యపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. స్థానిక జగన్నాథపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పటించాడని స్థానికులు చెప్పారు.

మహిళకు నిప్పుపెట్టడాన్ని గమనించిన స్థానికులు, మంటలు ఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన బాధితురాలిని విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చిత్తూరులో యువతిపై అత్యాచార యత్నం

A man allegedly murder attempts on his wife

చిత్తూరు: జిల్లాలోని తవనంపల్లి మండలం దిగువ మోదలపల్లి దళితవాడలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కల దాడి: బాలుడి పరిస్థితి విషమం

నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి గాయపరిచాయి. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+