అనుమానం: భార్యను చంపి భర్త ఆత్మహత్య
అనంతపురం: అనుమానం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి, అతను రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేగాక కూతురును సైతం కత్తితో పొడిచాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ప్రశాంతిగ్రామ్‌లో బుధవారం జరిగింది.
ఆర్‌ఎంపిగా పనిచేస్తున్న మురళీనాయక్(30) తన భార్య లీలాబాయి(25), పిల్లలు మోక్షిత్(4), లాస్య(2)తో కలిసి ప్రశాంతిగ్రామ్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, కొంత కాలంగా మురళీనాయక్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. బుధవారం మధ్యాహ్నం భార్యాభర్తలు మరోసారి ఇంట్లో గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మురళీ నాయక్ తన భార్యను కత్తితో పొడిచి, గొంతు కోసి చంపాడు. అనంతరం అక్కడే ఉన్న కూతురు లాస్యను సైతం పొడిచి ఇంటికి తాళం వేసి బయటపడ్డాడు.
చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి వచ్చి చూడగా లీలాబాయి ప్రాణాలు విడిచింది. కొనఊపిరితో ఉన్న లాస్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా నాయక్ సమీపంలోని ప్రశాంతినిలయం రైల్వేస్టేషన్ చేరుకుని గుంటూరు ప్యాసింజర్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications